అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కని గొర్రెలను అధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో గొర్రెలకు నట్టల నివారణ మాత్రలు వేసి.. దక్కని జాతి గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులు, క్షేత్ర సహాయకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన దక్కని గొర్రెల మాంసాన్ని అందించేందుకు సిద్దిపేట పట్టణంలోని నాన్‌వెజ్ మార్కెట్లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన గొల్ల, కురుమలు దక్కని గొర్రెల మాంసాన్ని విక్రయించాలన్నారు. అనంతరం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement