మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి, బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఇద్దరు చనిపోయారు. మృతుల్లో ఒకరు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యాదగిరిగా గుర్తించారు. అయితే, మరొకరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. యాదగిరి మృతదేహం రైలు పట్టాల పక్కన పడి ఉండగా.. మరొక వ్యక్తి మృతదేహం రైలు పట్టాలపై నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడి చేతిపై అమ్మ అని రాసి ఉండగా.. చెవికి చెవి పోగు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, వేరు వేరు ప్రమాదాలు జరిగి ఇద్దరు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement