Saturday, November 23, 2024

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్సవం..

‌మెదక్‌ : ఈ నెల 11 నుండి 14 వరకు జిల్లా అంతటా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ ఉత్సవంలో ప్రజలందరూ పాల్గొని టీకా వేయించుకోవలసిందిగా జిల్లా కలెక్టర్‌ యస్‌. హరీష్‌ పిలుపునిచ్చారు. వైద్యాధికారులందరూ తక్షణమే మండలంలోని అన్ని మండల అధికారులతో సమావేశమై కోవిడ్‌-19 వ్యాధి తీవ్రతను, టీకా ఆవశ్యకతను తెలియేసి ప్రతి ఒక్కరు టీకా వేయించుకనేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్‌ రెండవ దశ ఆందోళన కలిగిస్తుందని మరోసారి యుద్దం చేయవలసిన అవసరం ఉన్నదని, దానిని అలక్ష్యం చేయరాదని గురువారం ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో దేశప్రధాని పేర్కొన్నారని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 30,118 మంది మాత్రమే టీకా తీసుకున్నారని, ప్రజలలో టీకా పట్ల అపోహ, బయాందోళలు అవసరం లేదని అవగాహన కలిగించాలని అన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో రోజు కనీసం 150 మందికి తగ్గకుండా వ్యాక్సినేషన్‌ వేయాలని అన్నారు. అలాగే జిల్లా ఆస్పత్రిలో 300, ఏరియా ఆస్పత్రి, సబ్‌సెంటర్‌లలో 200 మందికి తగ్గకుండా వ్యాక్సిన్‌ వేయాలని కలెక్టర్‌ వైద్యాధికారులకు సూచించారు. ఆ తర్వాత టీ కాలకు వచ్చిన వారందరికి ఆర్‌టిఏ పరీక్షలు, ఆర్‌ఎస్‌టిపిసిఆర్‌ పరీక్షలు చేసి వారి సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఆర్‌ఏటి పరీక్షలు పెంచాలని సూచించారు. టెస్టింగ్‌ఒ, ట్రేసింగ్‌ ట్రీట్మెంట్‌ పద్దతిన కరోనా కట్టడి చేయడం ఒక్కటే మార్గమని ఆ దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని అన్నారు. కరోనా తీవ్ర రాబోయే రెండు, మూడు వారాలలో విపరీతంగా పెరిగే అవకాశముంటుందని కావున ప్రజలందరు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దని, తప్పనిసరిగ్గా మాస్కులు దరించాలని, శానిటైజర్‌ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సుమిత్రరాణి, విజయ నిర్మల, అనిల, అరుణశ్రీ, ఇర్షద్‌, నవీన్‌, ఏఏంఓ కుమారస్వామి, పాండురంగాచారి, వహీంఫాసా, వివిధ మండల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement