Saturday, November 23, 2024

క్వారీ ఏర్పాటును విరమించే దాకా ఆందోళన ఆగదు – జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్

జిన్నారం : కంకర క్వారీ ఏర్పాటును నిరసిస్తూ సోలక్ ప‌ల్లి రాళ్ల కత్వ గ్రామాల ప్రజలతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ తో డీఎస్పీ భీమ్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకు ససేమిరా ఒప్పుకోకుండా ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉంటామన్నారు. క్వారీ ఏర్పాటుతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే ప్రజాభిప్రాయ సేకరణను మానుకొని క్వారీ ఏర్పాటు ప్రక్రియను అధికారులు రద్దు చేసుకోవాలని సూచించారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ప్రభాకర్ పోలీసులకు తేల్చి చెప్పారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు, నాయకులు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement