Saturday, November 23, 2024

దేశానికి దిక్సూచి తెలంగాణ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి

ప‌టాన్ చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి దిక్సూచిగా మారుతున్నాయని ప‌టాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప‌టాన్ చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1164 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ల ప్రోసిడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఏమి వస్తుంది అన్నవారికి నేడు నిరుపేదల కోసం అందిస్తున్న పెన్షన్లే ఉదాహరణ అని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు అండగా నిలుస్తూ ప్రతినెల రూ.2000 పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వరాశమైన గుజరాత్ లోను ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని గుర్తు చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ, సంక్షేమం అభివృద్ధి కోరుకుంటారే తప్ప మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించారని అన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ప‌టాన్ చెరు నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

అమీన్పూర్ మండల పరిధిలో..
అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలకు చెందిన 204 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను మంగళవారం కృష్ణారెడ్డిపేట గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement