Friday, November 22, 2024

MDK : ఓటు హ‌క్కును వినియోగించుకున్న క‌లెక్ట‌ర్‌, ప్ర‌ముఖులు

సంగారెడ్డి, మే 13 (ప్రభ న్యూస్): జ‌హీరాబాద్‌, మెద‌క్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎన్నిక‌ల స‌ర‌ళి కొన‌సాగుతుంది. ఉద‌యం నుంచి పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ వల్లూరి క్రాంతి ఉద‌యం త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉద‌యం 9గంట‌ల వ‌ర‌కు 12.88శాతం ఓటింగ్ న‌మోదైంది. మెదక్​ పార్లమెంట్​ పరిధిలో ఉదయం 9గంటల వరకు 10.99% ఓటింగ్ శాతం నమోదైంది. అలాగే రెండు పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఓటింగ్ ప్ర‌క్రియ‌ను పోలీసు అధికారులు, క‌లెక్ట‌ర్‌లు, ఎన్నిక‌ల అబ్జ‌ర్వ‌ర్లు ప‌రిశీలిస్తున్నారు. ఓట‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ల్లూరి క్రాంతి ద‌గ్గ‌రుండి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. బందోబ‌స్తు ఏర్పాట్ల‌పై పోలీసుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు.

ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా క‌లెక్ట‌ర్ క్రాంతి మానిట‌రింగ్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ లోని 91 పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 11 గంటల వరకు 29.23%

32 – హుస్నాబాద్ నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 30.35 %

33 – సిద్దిపేట నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 26.53%

41 – దుబ్బాక నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 30.45%

42 – గజ్వేల్ నియోజకవర్గ ఓటింగ్ శాతం:- 29.65%

Advertisement

తాజా వార్తలు

Advertisement