Friday, November 22, 2024

కలెక్టర్‌ హరీశ్‌కు వినతి

మెదక్‌ : కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించాలని కోరుతూ మెదక్‌లోని ప్రైవేట్‌ కళాశాలల అధ్యాపకులు జిల్లా కలెక్టర్‌ హరీశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు రామారావు, మచ్చేంద్రనాథ్‌, సాయిరాం, మల్లేష్‌, కొమురయ్య, సందీప్‌లు మాట్లాడుతూ గత సంవత్సరం కాలం నుండి రెండు నెలలు మాత్రమే భౌతికంగా కళాశాలలు నడిపి వెంటనే మళ్ళీ కళాశాలలు మూసివేయడంతో ప్రైవేట్‌ అధ్యాపకులకు వేతనాలు లేక కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కళాశాలలు తిరిగి ప్రారంభించాలని వారు కోరారు. చాలా మంది అధ్యాపకులు ఉపాధిలేక పవిత్రమైన అధ్యాపక వృత్తిని వదిలి జీవనోపాధి కొరకు ఇతర రంగాల్లోకి వెళ్తున్నారని ప్రభుత్వం దయచేసి ప్రైవేట్‌ అధ్యాపకుల దయనీయ స్థితిని అర్థం చేసుకొని కనీస భృతిని కూడా అందజేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌ స్పందిస్తూ ప్రైవేట్‌ అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వానికి తెలుపుతామన్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్‌లోని ప్రైవేట్‌ కళాశాలల అధ్యాపకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement