ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలితీవ్రత పెరుతుంది. ఉదయం 9 గంటల వరకు ఇంట్లో నుంచి భయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురుస్తుంది. దీంతో వాహనదారులు రోడ్డు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పంజా విసురుతుంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. సంగారెడ్డిలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా.. సిద్దిపేట జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతగా, మెదక్ జిల్లాలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు చలికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు నిపుణులు సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement