Saturday, November 23, 2024

MDK: సీఎం సభను విజయవంతం చేయాలి…

నర్సాపూర్, ఆగస్టు 16 (ప్రభ న్యూస్): ఈనెల 23న మెదక్ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు కోరారు. ఈ సభకు నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి సుమారుగా 40 వేల నుంచి 45 వేలకు పైగా మందిని తరలించి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేసి నర్సాపూర్ నియోజకవర్గ సత్తా చూపి, ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నిధులను తెచ్చుకుందామని అన్నారు.

ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్ లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం బిజెపి, కాంగ్రెస్ వాళ్ల ఒక్కమాట మాట్లాడితే వారికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పది మాటలతో దీటుగా సమాధానం చెప్పాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడవసారి మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవిలో చూడాలని, అందుకు ప్రతి కార్యకర్తలు, నాయకులు ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని వారు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే, నర్సాపూర్ నియోజకవర్గ రూపురేఖలు మారడంతో పాటు అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్త, నాయకులు సైనికులుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ నెంబర్ మన్సూర్ పీఏసీఎస్ చైర్మన్లు రాజు యాదవ్ వెంకటరామిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, పైడి శ్రీధర్ గుప్తా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భోగచంద్రశేఖర్, శివంపేట్ ఎంపీపీ హరికృష్ణ, ఆయా మండలాల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement