Tuesday, November 26, 2024

MDK: కేంద్రంతో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందమా..?

కుర్చి బచావో బడ్జెట్ లాగే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది
మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి
మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి

సంగారెడ్డి, జులై 24 (ప్రభ న్యూస్) : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో పన్నులు కేంద్రానికి పోతున్నా నిధుల కేటాయింపులో మాత్రం మొండి చెయ్యి చూపారన్నారు. తెలంగాణ‌ ప్రజలు కట్టిన పన్నులు కావాలి తప్ప… కేంద్రానికి రాష్ట్ర అభివృద్ధి పట్టదా…! కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మిగతా ఎంపీలు ఈ విషయాన్ని బ‌డ్జెట్ లో ప్రస్తావించాలని సవరణ కోరాలన్నారు.

బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయని మాయమాటలు చెప్పారు. రైల్వే లైన్ లో కానీ, రోడ్ల విషయంలో కానీ, ప్రత్యేక నిధుల విషయంలో కానీ తెలంగాణ గుర్తుకు రాలేదన్నారు. ఢిల్లీ చుట్టూ చెక్కర్లు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రులకు, ప్రధాన మంత్రికి మెమొరాండం ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణకు కేంద్రం నుంచి ఏమి సాధించార‌ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేంద్రంతో లోపాయికారీ ఒప్పందమా…! తెలంగాణ ప్రజలు అంటే చిన్న చూపా… ఇంత ఘోరమైన బడ్జెట్ గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదన్నారు.

మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష అని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అణిచివేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు బీజేపీ ఎంపీలున్నా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అఖిలపక్షంతో పార్లమెంటుకు పోవాలి.. సీఎం వెంటనే చొరవ తీసుకుని బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోడీ, కేంద్రం మంత్రులను కలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మ్యాకం విఠల్, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement