Saturday, November 23, 2024

పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట..

ఉమ్మడి మెదక్​ : పట్టణాల అభివృద్ధికి తెలంగాణ  ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని   జహీరాబాద్​ ఎమ్మెల్యే కొనింటి మాణిక్​ రావు అన్నారు.   జహీరాబాద్ పట్టణంలోని గాంధీనగర్,  బుడగ జంగం కాలనీలలో  రూ.  10 లక్షల  (ఎస్సీఎస్​స్పీ ‌‌_ 2019-20 షెడ్యుల్ క్యాస్ట్ సబ్ ప్లాన్) నిధులతో చేపడుతున్నసీసీ రోడ్డు,  మురికికాల్వల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్​ రావు మాట్లాడుతూ  జహీరాబాద్​  నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.కోట్లల్లో నిధులు వెచ్చించడంతో  పట్టణం సుందరంగా  మారుతుందన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా  పట్టణాలను అభివృద్ధి చేస్తున్న ఎకైక ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వమేనన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.  అలాగే జహీరాబాద్​  పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కాలనీల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలను వేస్తున్నందున ఎమ్మెల్యే మాణిక్​ రావుకు కాలనీ వాసులు సన్మానించి, అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో   టీఆర్​ఎస్​ నాయకులు  కళ్లం చంద్రయ్య , జాకీర్, చంద్రయ్య, సిరాజ్, మొబిన్, అనూషమ్మ, రాములమ్మ,   మున్సిపల్ అధికారులు  పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement