Tuesday, November 26, 2024

కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి..

దుబ్బాక :కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆద్వర్యంలో దుబ్బాకలో కార్మిక వ్యతిరేక కోడ్ల కాఫీలను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో నియంతృత్వ పాలన సాగిస్తుందన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం దేశలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వారి హక్కులు, చట్టాలను సాధించుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోనిఇ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 రకాల చట్టాలను నాలుగు కోడ్లుగా సవరిస్తూ కార్మికులకు వ్యతిరేంగా పరిశ్రమ అధిపతులు అనుకూలంగా చట్టాలను చేయడం దుర్మార్గం అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరశిస్తూ కార్మికులు పోరాటాలు చేస్తే అవి చేయరాదని యాజమాన్యం దయా దాక్షిన్యాలతో వారికి వేతనాలు లేదా తమ హక్కులు పొందాలని భానిసలుగా తయారు చేస్తుందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటల వరకు పెంచడం వల్ల కార్మికుల శ్రమ దోపిడి చేయడమేనని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాలు మార్చడం వల్ల కార్మికుల హక్కులను పూర్తిగా ద్వంసం చేయడమే అన్నారు. దీని వల్ల దేశంలో మరో ఆర్థిక సంక్షోభంకు దారి తీసే పరిస్థితులు రావచ్చన్నారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణ చట్టం కూడా రద్దు చేయడం వల్ల ఈ రోజు ధరలు పెరుగుదలకు కారణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధి నుడి కార్మికులు, రైతులు, ప్రజల హక్కులను ప్రైవేటు దోపిడీ దారులకు అప్పనంగా అప్పజెప్పే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ రోజు నుండి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర తీసుకచ్చిన కార్మిక వ్యతిరేక కోడ్లను అమలు చేయాలని చూస్తుందని అందుకోసం కొన్ని రాష్ట్రాలు కూడా సిద్దం కావడం సిగ్గు చేటన్నారు. దేశంలోని ప్రజా స్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అపహాస ్యం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో అధికారం మందబలం ఉన్నదని కార్మిక చట్టాలను మార్చడం బీజేపీ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని అన్నారు. దేశంలో రైతులు, కార్మికులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని పోరాటాలు చేస్తున్నప్పటికి పాలకులు మారడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు మార్చుకోవాలని కార్మిక హక్కులు రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే భవష్యత్‌లో సీఐటీయూ ఆద్వర్యంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలకు సిద్దం అవుతామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ నాయకులు తడ్క లచ్చయ్య, కార్మికులు రాజు, భానుచందర్‌, శ్రీనివాస్‌, మహేష్‌, రవి, కిషన్‌, రమేష్‌, సత్యం, మోహన్‌, రామచంద్రం, బాల్‌కిషన్‌, ఎలండర్‌, సుధాకర్‌, మంజుల, పద్మ, లావన్య, రత్నమాల, నాని తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————

Advertisement

తాజా వార్తలు

Advertisement