Saturday, November 23, 2024

పేదింటికి పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు/అమీన్పూర్ : ఆడపిల్ల పెళ్లి నిరుపేద కుటుంబానికి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్ చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, జిన్నారం, బొల్లారం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 267 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పక్కల ద్వారా మంజురైన రెండు కోట్ల 67 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆడపిల్ల పెళ్లి చేసేందుకు నిరుపేద ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పార్టీలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు.
పటాన్ చెరులో
పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 120 మంది లబ్ధిదారులకు మంజూరైన కోటి 20 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జీఎంఆర్ పంపిణీ చేశారు.
అమీన్ పూర్ లో…
అమీన్పూర్ మండలం మున్సిపల్ పరిధిలోని వివిధ గ్రామాలు, కాలనీలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement