రామచంద్రాపురం : డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలు పరిశీలించారు. చెరువును సుందరీకరించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీర్చిదిద్దేందు కోసం నిధులు మంజూరై పనులను ప్రారంభించిన సంగతి పాఠకులకు విధితమే..కాగా స్థానిక కార్పొరేటర్ పుష్పనగేష్‌తో కలిసి వారు పనులను పరిశీలించారు. ప్రధానంగా తూము గుండా వ్యర్థ జలాలు బయటకు వెళ్లనందున అడ్డంగా ఉన్న చెత్తా, చెదారాన్ని జెసిబి సహయంతో కార్పొరేటర్ తీసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో చెరువు సుందరీకరణ పనులను పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే ఎండలు తీవ్రరూపం దాలుస్తున్నాయని, సుందరీకరణ పనులను త్వరగా పూర్తయితే సాయంత్రంవేళల్లో కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఆహ్లదకరమైన వాతావణాన్ని గడపవచ్చన్నారు. అదే విధంగా చెరువులోని వ్యర్థ జలాలు బయటకు పోయే కాలువ తూముల వద్ద మట్టి దిమ్మెలు, చెత్తా, చెదారం పేరుకుపోయి ఉన్నాయని, వాటిని దగ్గరుండి జేసిబి సహాయంతో తీసివేయించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని, ఆయనకు అండగా మనమందరం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలోలక్ష రూపాయలనిధులను మంజూరు చేయించాలంటే ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేదని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. వర్షకాలం ప్రారంభమయ్యేలోపు చెరువులోని పూడికతీతను తొలగించి తిరిగి నీరు నిండే విధంగా తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చెరువు పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..
By sree nivas
- Tags
- medak live news
- medak local news
- mla mahipalreddy
- ramachandrapuram
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement