మెదక్ : గత ఏడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పట్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురైన సంఘటనలు ఉన్నాయి. అయితే గత ఏడాది మార్చి 22 లాక్ డౌన్ ప్రకటించారు. అయితే నాటి నుండి నేటి వరకు ప్రజల్లో కరోనా భయం కొంతమేరకు తగ్గినప్పటికీ చాలామందికి ఈ వైరస్ పట్ల భయాందోళనలో ఉన్నారు. గత రెండు మూడు నెలల నుండి మళ్లీ కరోనా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నివారణ టీకాలు వేస్తున్నారు ఈ టీకాలు వేయించుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా కనీసం భౌతిక దూరం మాస్కులు ధరించకుండా ప్రజలు ఇష్టానుసారంగా సభలు.. సమావేశాలు.. విందు కార్యక్రమాలు ఇతరాత్ర ఫంక్షన్లలో గుంపులు గుంపులుగా ఉంటున్నారు తద్వారా ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా రామాయంపేట పట్టణంలో గత పది రోజుల వ్యవధిలో సుమారు 20 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే చెబుతున్నప్పటికీ ఎవరు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా పాఠశాలలు.. కళాశాలలు ..ఫంక్షన్ హాల్ కూరగాయలు మాంసం మార్కెట్లలో గుంపులు గుంపులు గా ఉంటూ భౌతిక దూరం పాటించక లేకపోతున్నారు. కనీసం మాస్కులు కూడా భరించలేని ఈ దుస్థితి నెలకొంది. ఎవరు కూడా తమకు ఏమీ కాదని అపోహలు ఉండి చుట్టుపక్కల వారికి ఈ కరోనా వ్యాధి వచ్చే విధంగా కారణమవుతున్నారు. వైద్యాధికారులు పదే పదే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. ఇదే కనుక రిపీట్ అయితే భారీ మూల్యం చెల్లించక తప్పదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement