సంగారెడ్డి : ఆటో, జీపు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని చౌట్కూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తార్దన్పల్లి వద్ద బొలెరో క్యారియర్, ప్యాసింజర్ ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. కొందరికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులు ఎక్కడి వారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement