కాంగ్రెస్ పార్టీ లోని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు పాటుపడుదామని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్ చెరునియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా పాటి గ్రామ మాజీ సర్పంచ్ రాములు యాదవ్, ఎంపీటీసీ గోపాల్ యాదవ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ యాదవ్, నందిగామ మాజీ సర్పంచ్ శివానంద్లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మధును ప్రజా ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ అధిష్టానం అరుదైన అవకాశాన్ని తనకు ఇచ్చిందని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని కోరారు.
పార్టీలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్దాం అని ప్రజా ప్రతినిధులకు సూచించారు.
బ్లెస్సింగ్స్ ఉండాలి….
బ్లెస్సింగ్స్ ఉండాలి… నేను సొంతింటి వ్యక్తినని తెలిపారు. నందిగామలోని శివానంద్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్తి సహకారాలు మధుకి ఉంటాయని, ఎన్నికల్లో గెలుపునకు కృషి చేస్తామని కూడా నీలం మధుకు హామీ ఇచ్చారు.
మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి మాదిరి జైపాల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఎంపీ ఎన్నికలలో గెలుపు కోసం తనవంతుగా కృషి చేస్తానని జైపాల్ ఈ సందర్భంగా నీలం మధుకు హామీ ఇచ్చారు. తప్పకుండా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టాలని కూడా ఆకాంక్షించారు.