Friday, November 22, 2024

MDK : నన్ను దీవించండి.. ఎంపీ అభ్యర్థి నీలం మధు

పార్లమెంట్ ఎన్నికలలో తనను గెలిపించి, స్వర్గీయ ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించిన స్వర్గీయ ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు, కంపెనీలను తీసుకువచ్చి, కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని బిజెపి బీఆర్ఎస్ లు ప్రశ్నిస్తున్నాయని, గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయా పార్టీలు ఏం చేశాయో? చూపాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలోనే పేదలకు ఇండ్లు, భూములు కేటాయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీల అమలుతో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తనను గెలిపిస్తే ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి ఈ మెదక్ గడ్డ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.పార్లమెంట్ ఎన్నికలలో ఎవరి మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పటాన్ చెరువు ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అవినీతి, అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు అభ్యర్థిని వెంటబెట్టుకొని వస్తున్నాడని, ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండలంలో మెదక్ అభ్యర్ధి నీలం మధు ముదిరాజ్ ప్రచారం నిర్వహించారు. గుమ్మడిదల నుంచి జిన్నారం చేరుకున్న ఎంపీ అభ్యర్థి నీలం మధు, సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల ఇంచార్జి శ్యామ్ గౌడ్ లకు మండల కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచార రథంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మండల పార్టీ ఆధ్వర్యంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించారు. జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, ఎంపీపీ రవీందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ నరేష్, జానా బాయ్, సంతోష్, నారబోయిన శ్రీనివాస్ మండలంలోని వివిధ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తతిథరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement