కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా రామంతపూర్ రామలింగేశ్వరాస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనలను తీసుకున్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి మాసాయిపేట వరకు ప్రచార రథంలో ర్యాలీ నిర్వహించారు.
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం రామంతాపూర్ కు ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, సుహాసిని లతో కలిసి చేరుకున్నారు. స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామంతపూర్ లోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రామంతపూర్ నుంచి ప్రచార రథంలో మాసాయిపేట వరకు ర్యాలీ చేపట్టారు.
మాసాయిపేట కార్నర్ మీటింగ్…
లోక్సభ ఎన్నికలలో తనను ఆశీర్వదించి, మెదక్ గడ్డకు ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ రుణం తీర్చుకోవాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాసాయిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మ కుటుంబం చేసిన సేవ ఎనలేనిదని పేర్కొన్నారు. ఇందిరా హాయంలోనే మెదక్ జిల్లా ప్రాంతానికి పరిశ్రమలు, కంపెనీలను తీసుకొచ్చి చాలా వరకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు. అలాగే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి ఈ సందర్భంగా నీలం మధు కృతజ్ఞతలు తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి, సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట ఎంపీటీసీ వి.కృష్ణారెడ్డి మండల పార్టీ అధ్యక్షులువి. శ్రీకాంత్ రెడ్డి , మాసాయిపేట టౌన్ అధ్యక్షులు, జంగిటిభూపాల్ , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ముక్క దశరథ మండల పార్టీ ముఖ్య నాయకులు కోప్పలపల్లి కరుణాకర్ రెడ్డి, కుప్పలపల్లి శ్రీనివాస్ రెడ్డి, కుప్పలపల్లి జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.