Tuesday, November 19, 2024

బీజేపీ రాష్ట్ర నాయకుడు నెమలికొండ వేణుమాధవ్ అరెస్ట్

సంగారెడ్డి, జులై 20 (ప్రభ న్యూస్) : బీజేపీ రాష్ట్ర నాయకుడు నెమలికొండ వేణుమాధవ్ ను గురువారం సదాశివపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన కోసం బాటసింగారం పిలుపునిస్తే ముందస్తుగా సదాశివపేట పోలీసులు వేణు మాధవ్ ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ధమన నీతితో వ్యవహరిస్తుందన్నారు. ప్రజల గొంతుకలను, బీజేపీ నాయకులను అరెస్టులతో ఇబ్బంది పెడుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అనేక అక్రమాలు జరిగాయని, ప్రతి పేద వాడికి, అర్హులైన వారికి డబల్ బెడ్ రూములు ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ల హామీని అటకెక్కించారన్నారు.

రానున్న రోజుల్లో బీజేపీ ప్రజల పక్షాన మరింత ఉద్యమం చేసిందని అరెస్టులకు బెదరదని హెచ్చరించారు. బీజేపీ ప్రజల కోసం పోరాడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలో రావడం సత్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీకాంత్, బీజేపీ దళిత మోర్చా కార్యదర్శి బైండ్ల చిన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement