Saturday, November 23, 2024

ఉచితాలు వ‌ద్ద‌నే బీజేపీకి బుద్ది చెప్పాలి : మంత్రి హ‌రీష్ రావు

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న 584 మందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక నుంచి మీకు నెల నెల రూ. 2016 అందుతాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ రు.75 ఉండేద‌ని, ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి ఇచ్చేవి కావు అన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసింది. కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదు అన్నారు. కానీ మేము మాత్రం ఏకంగా 10 ఇంతలు పెంచి, రూ.2016 చేశాము అన్నారు. పింఛన్ల డబ్బు పెరిగింది, పింఛన్ల సంఖ్య పెరిగింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిన మార్పు అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామ‌ని, ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌న్నారు. కన్న కొడుకు చీర కొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారు. బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నరు. మాకు కులం లేదు మతం లేద‌ని, పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తూప్రాన్ గజ్వేల్ మెదక్ లో మంచి ఆసుపత్రులు వచ్చాయి. కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉండేద‌ని, అయినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు అన్నారు. బీజేపీలో కొంత మంది ఉచితాలు వద్దు అంటారు. బీజేపీకి త‌గిన బుద్ది చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. కాంగ్రెస్ జమానాలో ఉచిత కరెంట్ కాదు ఉత్త కరెంట్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement