Thursday, November 21, 2024

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి..

హవేలీ ఘనపురం : మండలం లోని వామపక్షాల పిలుపులో భాగంగా మండలంలో వ్యవసాయ కార్మిక శాఖ జిల్లా కార్యదర్శి కే మల్లేశం ఆధ్వర్యంలో బంద్ మరియు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను నియంత్రించాలని భారత్ బంద్ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. పంట నిల్వ చేసుకోవడానికి రైతులకు ఉన్న హక్కులను కాగా చేస్తున్నారని ఆహారం విలువలపై కార్పొరేటర్ కు పూర్తి స్వేచ్ఛ కల్పించా రాణి ఆయన దుయ్యబట్టారు. ప్రకృతి వైపరీత్యాల నష్టం గురించి గాని కనీస మద్దతు ధర గురించి గానీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న రైల్వే లు విమానాలు ఇన్సూరెన్స్ లు బ్యాంకులు విశాఖ ఉక్కు తదితర రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టిన ఎందుకు సన్నాహాలు ప్రారంభించింది అని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి 200 రోజుల పనిదినాలు కల్పించాలని ఆయన తెలిపారు రైతులకు రక్షణ కల్పించే సంస్థలుగా చట్టాలను తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వ్యవసాయ సంఘ కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement