Friday, November 22, 2024

అభివృద్ధి పథంలో బస్వాపూర్ భేష్..

జగదేవపూర్ : అభివృద్ధి పథంలో బస్వాపూర్ గ్రామం భేష్ అని గజ్వెల్ గడ అధికారి ముత్యం రెడ్డి అన్నారు. జగదేవపూర్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో గడపగడప కి గడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడా ప్రత్యేకాధికారి ముత్యం రెడ్డి బస్వాపూర్ గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని సమస్యల పై అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనం బాగుందని కితాబిచ్చారు. గ్రామంలో నర్సరీ , డంపింగ్ షెడ్ , వైకుంఠధామం చాల బాగున్నాయని ప్రశంసించడం జరిగింది . గ్రామంలో పారిశుద్ధ్యం పై చూపెట్టే ప్యాత్యేక శ్రద్ధ పై అడిగి తేలుసుకున్నారు. గ్రామ పరిశుభ్ర కు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. తడి చెత్త.. పొడి చెత్త ఫై ఇంకా అవగాహన పెంచాలని సూచించడం జరిగింది. బస్వాపూర్ గ్రామంలో రోడ్డు కు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించిన ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రోడ్డుకిరువైపులా మొక్కలు చాలా బాగున్నాయి అని ప్రశంసించారు .మళ్లీ నూతనంగా నాటే మొక్కలు కూడా అదేవిధంగా కాపాడి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఆలేటి మమత , ఎంపిపి బాలేశం గౌడ్ , పి ఏ సి స్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనరెడ్డి ,ములుగు డివిసన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి , సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ , యూత్ విభాగం జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,మండల్ కో ఆప్షన్ ఎక్బాల్ ,గడా ఎంపీడీఓ పాతాబిరామరవు , ఎంపీడీఓ మల్లికార్జున్, ఎంపీటీసీ స్రవంతి శివకుమార్, ఉప సర్పంచ్ అనసూర్య, ఎంపీఓ గారు , ఏపీఓ గారు , పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ , వార్డ్ మెంబెర్స్ , రైతు కమిటీ మెంబెర్స్ , అన్ని శాఖల అధికారులు , గ్రామ పెద్దలు ,టీఆరెస్ నాయకులు , గ్రామ కమిటీ ల నాయకుల , యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement