Monday, November 18, 2024

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 33 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

సిద్దిపేట జిల్లాలో దాదాపు 33 ట‌న్నుల బియ్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. సోమ‌వారం తెల్ల‌వారు జామాను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ప‌ట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ గురుస్వామి మాట్లాడుతూ.. లారీలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు.. లారీని పట్టుకొని అందులో ఉన్న సుమారు 33టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ సంఘటనలో హుస్నాబాద్‌కు చెందిన పర్వతం సంపత్‌, చెన్నూరు రవీందర్‌లతో పాటు మధ్యప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన లారీడ్రైవర్‌ అరుణ్‌కాడే, లారీక్లీనర్‌ రాహుల్‌కాడేలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని కొంతమంది దళారులు ప్రజల దగ్గర నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి వ్యాపారస్తులకు ఎక్కువ రేటుకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు తెలిపారు. అలాంటి వ్యక్తులపై జిల్లాలో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని అమ్మినా, కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుటామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడితే డయల్‌ 100 లేదా సిద్దిపేట పోలీస కమిషనరేట్‌ వాట్సప్‌ నెంబర్‌ 7901100100కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సమాచారం అందించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement