సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నిర్జిపల గ్రామ శివారులోని మంజీరా నదిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నారు. అంతలోనే అనూహ్యంగా మంజీరా నదిలో సుడిగాలి రేగింది. గింగిరాలు తిరుగుతూ ఆకాశం నుంచి నదిలోకి తెల్లని ధారలా ఏర్పడింది. సుమారు రెండు నిమిషాలసేపు నీరు నింగివైపు ఎగసింది.. అటుగా వెళ్లిన వారంతా ఈ అందమైన దృశ్యాన్ని ఆశ్చర్యంగా తిలకించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement