Friday, November 22, 2024

సేంద్రియ పద్దతిలో పంటలు సాగు..

కొల్చారం : మండల పరిధిలోని చిన్నఘణఫూర్‌లో మండల వ్యవసాయ అధికారి బాల్‌రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిహామి పథకంలో రైతులకు మేలు చేసే పథకాలు ఉన్నాయని, ఈ పథకాల ద్వారా వర్మీ కంపోస్టు ఫార్మ్‌పాండ్స్‌ అజోళ్లఫిట్స్‌ నిర్వహించుకొని పంట పండించే పద్దతిలో కొత్త మార్పులు తీసుకురావాలని తెలియజేశారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వరిలో వచ్చే అగ్గి తెగులును గమనించిన వెంటనే యూరియాను ఆపివేయాలని, దాని నివారణకు ట్రైసైక్లోజోల్‌ 120 గ్రా, ఎకరా మరియు మోగి పురుగు నివారణకు కార్టోఫిర్డోక్లోరైడ్‌ 400 గ్రామ్స్‌ ఎకరా వాడమని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిరోషా, వినిత రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement