చేగుంట : సహకార పరపతి సంఘాలు, ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సెక్టార్ అధికారి ఈఓ మాధవి పరిశీలించారు. రాంపూర్ ఐకేపి కేంద్రం, కరీంనగర్ ఐకెపి కేంద్రం, సోమ్లాతండా వద్ద సహకార పరపతి సంఘం కేంద్రాల వద్ద తూకం విధానంపై అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజుల క్రితం సోములతాండా సొసైటీ కేంద్రం వద్ద 40 కిలోల బస్తా భర్తీకి గాను కిలో 700 గ్రాముల వరకు తూకం ఎక్కువగా వేస్తున్నారని రైతులకు ఫిర్యాదుపై ఆమె స్పందించి సంచికి కిలోమాత్రమే ఎక్కువ తూకం వేయాలని ఎలాంటి ఫిర్యాదు రాకూడదని ఏఈఓ మాధవి కేంద్రం ఇంచార్జీకి సూచించారు. అలాగే ఐకేపి గొల్లపల్లి, మక్కరాజ్‌పేట సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తూకం వేసే ధాన్యం 17శాతం తేమ ఉండాలని జల్లెడపట్టి శుద్దిచేసి తూకం వేయాలన్నారు. కళ్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెడితే స్థలాలు సరిపోవని సూచించారు. లోడుకు సరిపడా ధాన్యం తూకం వేసిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని మాధవి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement