Saturday, November 23, 2024

కోవిడ్‌ టీకా ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యం..

కొండపాక : జిల్లాలోని ప్రతి పౌరునికి కోవిడ్‌ టీకా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు. కుకునూర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటుచేసిన కోవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమివేయాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలన్నారు. జిల్లాలో పీహెచ్‌సీ పరిధి దాటి మేజర్‌ గ్రామపంచాయతీల్లో కోవిడ్‌ టీకా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీల సహకారంతో స్థానిక ప్రజానీకానికి కోవిడ్‌ టీకా వందశాతం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆరోగ్య కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణదుర్గయ్య, ఆర్‌బీఎస్‌ అధ్యక్షుడు దుర్గయ్యలు పాల్గొనగా అంతకు ముందు ఉదయం స్థానిక సర్పంచ్‌ జయంతినరేందర్‌ టీకాం పంపిణీ కేంద్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా సిరిసినగండ్ల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కోవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాన్ని నిర్వహించారు. సుమారు గ్రామంలోని వెయ్యి మందికి పైగా ప్రజలు టీకా వేయించుకున్నారు. సర్పంచ్‌ లక్ష్మారెడ్డి సంపూర్ణ ఏర్పాట్లు నిర్వహించారు. మరోవైపు ఈనెల మొదటి నుండి కొండపాక మండలకేంద్రంలో నిర్వహిస్తున్న కోవిడ్‌ టీకా శిబిరంలో గురువారం సుమారు 400 మంది టీకా వేయించుకున్నారు. కుకునూర్‌పల్లిలో 600లకు పైగా టీకా వేయించుకున్నవారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement