సదాశివపేట : ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయాలపై అడ్వకేట్ ఆరతి ఫైర్ అయ్యారు. ఆడది అబల కాదు ఆదిపరాశక్తి అని ఆమె అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట రావు పట్టణంలోని రావుస్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అడ్వకేట్ హారతి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొత్తగొల్ల అనురాధ, మహిళా సంఘాల సభ్యులు శైలజ, ప్రవీణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు అని రంగాలలో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఎదిరించి పోరాడాలన్నారు. ఆడది అబల కాదు ఆదిపరాశక్తిగా నిరూపించుకోవాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement