ఉమ్మడి మెదక్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జన్మదినోత్సవం వేడుకలను సంగారెడ్డి బిజెపి కార్యాలయంలో బిజెపి దళిత మోర్చ అధ్యక్షుడు అశ్వంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్ రెడ్డి హాజరయ్యారై అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 8వ వార్డులోని సంజీవనగర్ ప్రజలకు 130 అంబేద్కర్ చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజలందరూ కొనసాగించాలని, అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చ రాష్ర్ట నాయకులు కె.జగన్, ఎన్.చంద్రశేఖర్, పట్లోళ్ల హన్మంతరెడ్డి, పట్లోళ్ల నర్సారెడ్డి, మురళీధర్ రెడ్డి, వాసు, మందులనాగరాజు, పవన్ ముదిరాజ్, ఆకుల సాయి, పట్టణ శాఖ అధ్యక్షులు వినోద్ కుమార్, రవిశంకర్, శంకర్, దుర్గయ్య, సంతోష్, లక్ష్మీ, ఈశ్వరీ, మీన, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట రూరల్లో.. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో డాక్టర్ బిఆర్అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జయంతి సందర్భంగా గొల్లగూడెం గ్రామ సర్పంచ్ మునిగి నవీన్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాలులు అర్పించారు. అలాగే బొబ్బిలిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ నల్లొల్ల కుమార్ , వెంకటాపురం గ్రామంలో గడ్డమీద బాలమణి, పెద్ధాపూర్ లో బోయిని శ్రీనివాస్, నగ్సాన్ పల్లిలో లక్ష్మి చంద్రశేఖర్ ,ఆరూర్ లో నాయికోటి మధు , నందికంది లొ కుందన రాజు, కోనాపూర్ లో శోభారాణి సంగమేశ్వర్ ,ఆత్మకూరులో గంగన్న లు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . గ్రామాల్లో యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు .
సదాశివ పేటలో..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ రాష్ట్ర నాయకులు సురేష్, కోడూరు శ్రీకాంత్ లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ నాయకులు ఖదీర్,ప్రదీప్ పాటిల్,నవీన్, నాగేష్,మహేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్లో..జహీరాబాద్ పట్టణంలో సుభాష్ గంజ్ టీ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకుని వివిధ దళిత సంఘాల నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు, భీమ్ ఆర్మీ నాయకులుతో పాటు మాదిగ దండోరా నాయకులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు వేరు వేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ తమ ప్రాంతాలనుంచి వచ్చిన వరాు కోవిడ్ నిబంధనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు రావణ్, జిల్లా అధ్యక్షులు డప్పు రాజు, నాయకులు, సిద్ధార్థ్, శివ ప్రసాద్, నిజాం, సలీం, మాక్స్ శ్రీనివాస్, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుడు రాంచందర్ భీమ్ వంశీ, ఖండం నర్సింలు, జనార్ధన్, చందర్, మదీనా అంజయ్య, అబ్రహం, మాదిగ దండోరా నాయకులు, రామ్, రాములు నేత, బిసి ఉద్యమ నేత, తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ వై. నరోత్తం ఆధ్వర్యంలో..టీపీసీసీ నాయకుడు వై. నరోత్తం ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మైనోద్దీన్, ముల్తాన. ఆగిశెట్టి, అంబునాయక్, షరీఫ్, గఫార్, పెంటన్న, హసన్, పర్వాన, పండరి, అశోక్, తుల్జాదాస్, బక్కన్న సమ్మన్న, దేవదాస్, చెంగల్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేటలో..అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, వైస్ చైర్మన్ చింత గోపాల్, పురపాలక సంఘం కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, పిల్లోడి విశ్వనాథం పులిమామిడి రాజు, చౌదరి ప్రకాష్, టిఆర్ఎస్ నాయకులు ఎర్ర చిన్న, తుల్జా రామ్, ఆదోని రాజు, నల్ల జయ రామ గౌడ్, సత్యనారాయణ, ప్రేమ్ కుమార్, నర్సింలు, నాగరాజు ,సునంద రావు తదితర దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మునిపల్లిలో.. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో డాక్టర్ దాదాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.వారిలో ఎంపీపీ శైలజ శివ శంకర్, జడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్, ఎంపీడీవో రమేష్ చంద్ర కులకర్ణి తదితరులు ఉన్నారు.