సంగారెడ్డి, మే 27 (ప్రభ న్యూస్): సోషల్ మీడియాలో నీటి సరఫరాపై వస్తున్న కథనాలు అవాస్తవమని వాటిని ప్రజలు నమ్మద్దని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సంగారెడ్డి పట్టణానికి అంగడిపేట నుండి మంజీరా ఇంటేక్ 600 మీటర్ల వ్యాసంగల పైప్ లైన్ ద్వారా నిరంతరం నీటి సరఫరా జరుగుతుందన్నారు.
ఈ పైప్ లైన్ శనివారం రాత్రి బ్రేక్ కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే ఆదివారం మరమ్మత్తు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి మున్సిపల్ పట్టణంలోని 1, 2, 3, 5, 18, 22, ఆరు వార్డులలో ఆదివారం ఉదయం మాత్రమే నీటి సరఫరా జరగలేదన్నారు. సోషల్ మీడియా లో వస్తున్నా , మూడు రోజులు గా నీటి సరఫరా బంద్ అనే వార్త అవాస్తవమని ఆయన అన్నారు. సంగారెడ్డి పట్టణంలో, నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మరమ్మత్తుల అనంతరం నీటి సరఫరా తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పట్టణంలో పర్యటించి 05, వార్డు కాలనీవాసులతో నీటి సరఫరా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.