Tuesday, November 19, 2024

ధాన్యం తేమ పరిశీలిస్తున్న ఏడిఏ..

చేగుంట : రైతులు ధాన్యాన్ని పొలం వద్ద కళ్లాలలో ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌ రైతులకు సూచించారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో చేగుంట పిఏసిఎస్‌ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం జల్లెడ పడుతున్న రైతులతో ఆయన మాట్లాడుతూ ఎండబెట్టిన ధాన్యం 17 శాతంలోపు తేమ ఉండాలని, రైతులు కానీ వ్యాపారులు కైనా నష్టం జరగకూడదన్నారు. వరికోత కోసే సమయంలో కోత మిషన్ల ఫ్యాన్‌ బెల్టులు, రైతులు లేదా మిషన్‌డ్రైవర్‌లు, ఓనర్‌లు చూసుకోవాలన్నారు. తూకం వేసే సమయంలో ధాన్యం నిల్వ చేస్తే టాపర్లు కప్పి తూకం వేసే వరకు భద్రపరుచుకోవాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిస్థితులను గమనించి రైతులు మసులుకోవాలని పిలుపునిచాచరు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శోభ, వడియారం సెంటర్‌ ఇంచార్జీ రమేష్‌, తూకం వేసే రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement