సదాశివపేట రూరల్ : సదాశివపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని నక్సనపల్లి చౌరస్తా సమీపంలో ఆదివారం ట్రాక్టర్, టూవీలర్ బైక్ ఢీకొనడంతో మహ్మద్ ఫిరోజ్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఔరాద్ గ్రామానికి చెందిన మమ్మద్ ఫిరోజ్ మెకానిక్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం తన బైక్ పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నక్సనపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫిరోజ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచరం మేరకు అక్కడకు చేరుకున్న సదాశివపేట సిఐ మహేష్ గౌడ్, ఎస్ఐ నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని తల్లి హలీమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.