Friday, October 18, 2024

TS | గ్యాస్ సిలిండర్ పేలి, కూలిన ఇంటి పైక‌ప్పు, నలుగురికి తీవ్ర గాయాలు

వెల్దుర్తి, (ప్ర‌భ న్యూస్‌) : మెద‌క్ జిల్లా, వెల్దుర్ది మండ‌లంలో వంట గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఇల్లు కూలిపోయిన ఘ‌ట‌న జ‌రిగింది. దీంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉప్పు లింగాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల వీరమని ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో ఇంటి పక్కన నివసిస్తున్న కుంట్ల పాండు ద్వారా వెల్దుర్తి లోని ఇండియన్ గ్యాస్ గోదాం నుండి గ్యాస్ సిలిండర్ తెప్పించుకుంది.

సిలిండర్ అమర్చి వెలిగిస్తున్న క్రమంలో గ్యాస్ లీకేజీ అయి భారీ శబ్దం రావడంతో వడ్ల వీరమణి నివసిస్తున్న ఇల్లు కూలింది. ఇంటి పక్కన‌ నివసిస్తున్న మంగలి వరలక్ష్మీ, మంగలి శ్యామల, కుంట్ల పాండు, వడ్ల వీరమణికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసుల‌కు ఎలాంటి స‌మాచారం అంద‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement