Friday, November 22, 2024

TS : వాహనాల తనిఖీల్లో 50 లక్షలు పట్టివేత

గజ్వేల్, మార్చి23 (ప్రభన్యూస్) : గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన పట్టణ ఇన్ స్పెక్ట‌ర్ బీ. సైదా ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 50లక్షలు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడానికి విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు.

- Advertisement -

గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, అడిషనల్ సీఐ ముత్యం రాజు, సిబ్బంది మరియు కేంద్ర బలగాలు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలసి అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేయుచుండగా కారు నెంబర్ టీఎస్36సి-O198 గలదానిలో యజమాని బచ్చు రత్నాకర్ గ్రామం రాయపోల్, తన యొక్క కారులో 50 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళ్ళుచుండగా సీజ్ చేయడం జరిగిందన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు 50 వేలకు మించి ఎవరు కూడా డబ్బులు వాహనాలలో తీసుకొని వెళ్లవద్దని సూచించారు. ఎక్కువ తీసుకొని వెళ్ళినచో తప్పకుండా దానికి సంబంధించిన పత్రాలు వెంబడి ఉంచుకోవాలని సూచించారు. లేకుంటే డబ్బులను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ కమిటీకి ద్వారా ఐటీ డిపార్ట్మెంట్ కు దొరికిన డబ్బులు అప్పగించడం జరుగుతుందన్నారు. సదరు బాధితుడు అక్కడికి వెళ్లి అధికారులకు డబ్బులకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపించి రిలీజ్ చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement