Monday, November 25, 2024

TS | తెలంగాణ సరిహద్దుల్లో 4.58 లక్షల పట్టివేత.. జహీరాబాద్​ వద్ద పట్టుకున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.4లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. 65వ నంబర్‌ జాతీయ రహదారిపై చిరాక్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మహారాష్ట్రకు చెందిన బిందాస్‌ రూ.4లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఇక.. కర్నాటకకు చెందిన సలావుద్దీన్‌ కారులో రూ.58వేలు తరలిస్తుండగా చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు చూకపోవడంతో నగదును సీజ్‌ చేశారు. నిబంధనల ప్రకారం రూ.50వేలకు మించి నగదును తరలించే సమయంలో తప్పనిసరిగా పత్రాలను చూపించాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement