పటాన్చెరు : ప్రతిఒక్కరు సేవా దృక్పధం అలవర్చుకోవడంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. శబరిమల అయ్యప్ప సేవా సమావజం ఆద్వర్యంలో పట్టణంలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన అయ్యప్పస్వాములు, గురుస్వాములు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు మాలిన ధర్మం పనికి రాదని, తాను నమ్మిన ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. పుట్టిన మతాన్ని, ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను అగౌరవ పరచుకుండా ముందుకు సాగాలని ఆయన కోరార.ు. గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వేలాది మంది అయ్యప్ప స్వాములకు సేవ చేసే భాగ్యం దక్కినందకు కృతజ్ఞుడిని అని తెలిపారు. మనిషి తన జీవితంలో ఎంత డబ్బు సంపాదించినప్పటికిని దైవ చింతన, సేవాగుణం లేకపోతే ఆ జీవితానికి అర్ధం లేదన్నారు. మానససేవే మాధవ సేవ అన్న సామెతకు అనుగుణంగా పేదవాడి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అండగా నిలిచినప్పుడే మనం కొలిచేదేవుడు ఆశీర్వదిస్తారని అన్నారు. హిందువుల ఆరాధ్యదైవమైన గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని గుడులు, మసీదులు, చర్చిల అభివృద్ధికి, నూతన నిర్మాణాలకు ఉడతాభక్తిగా సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకటరెడ్డి, గూడెం మధుసూదన్‌రెడ్డి, సేవా సమితి సెంట్రల్ అర్గనైజింగ్ సెక్రటరీ నాయిని బుచ్చిరెడ్డి, సమితి ప్రతినిధులు బిక్షపతి, సంజీవరెడ్డి, కాజు గురుస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి, నవీన్, అయ్యప్ప సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement