శివ్వంపేట : తన స్వీయరక్షణకు కరాటే ఎంతో అవసరమని జడ్పీటిసి పబ్బ మహేష్‌గుప్త అన్నారు. శివ్వంపేటలో రాయల్ షాడోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజెషన్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కరాటే బ్లాక్ బెల్ట్ పోటీల కార్యక్రమానికి జడ్పీటిసి మహేష్‌గుప్త ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పలు విన్యాసాలతో కరాటే ప్రదర్శనలు చేపట్టిన అనంతరం జడ్పీటిసి తన సొంత డబ్బులతో 17మంది విద్యార్థులకు కరాటే బ్లాక్ బెల్టులు, మిగతా విద్యార్థులకు స్థాయి బెల్టులను, పలు విద్యార్థులకు కరాటే రక్షణ కిట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటిసి మహేష్‌గుప్త మాట్లాడుతూ కరాటే శారీరకంగా ఆరోగ్యంగా, మానసిక ఉల్లాసానికి దోహదపడటమే కాకుండా ఆత్మ రక్షణకు ఉపయోగమన్నారు. కరాటే మాస్టార్ నర్సింగరావు బాలురతో పాటు బాలికలకు సైతం కరాటే శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. కరాటే విద్యార్థులకు, కరాటే ఆర్గనైజేషన్ వారికి కావలిసిన సహాయ, సహకారాలను తప్పకుండా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ రాజిపేట పద్మవెంకటేష్, షాడోఖాన్ కరాటే అధ్యక్షులు నర్సింగరావు, ఉపాధ్యక్షులు మహేష్, ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి, సంపత్‌కుమార్, సలహాదారు సహదేవ్, పర్యవేక్షకులు ఆసిఫ్, కార్యదర్శి సుధాకర్, ఇన్సుపెక్టర్ మాధురి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement