Monday, November 25, 2024

వైభవంగా బండ్ల ఊరేగింపు

పెద్దశంకరంపేట : పెద్దశంకరంపేట పట్టణం శివారులో కట్టమైసమ్మ గురుపాదగుట్ట శివాలయం ఆవరణలో వేదబ్రహ్మణ పండితుల మంత్రోచ్చరణలతో.. వైరో వైపు మంగళవాయిద్యాల చప్పుళ్లతో పార్వతీ, పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ బాధ్యులు కన్నుల పండువగా నిర్వహించారు. పలువురు గ్రామ పెద్దలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళ్యాణోత్సవ మండపాన్ని రకరకాల పూలతో, అరటి మట్టెలతో అందంగా అలంకరించారు. పార్వతీ, పరమేశ్వరుడి ఉత్సవ విగ్రహాలకు వేద బ్రహ్మణులచే కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద బ్రహ్మణులు శివపార్వతుల కళ్యాణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆయా గృహాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు, ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహించడంతో పట్టణంలోని ఆయా కాలనీల నుంచి భక్తులు మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వైభవంగా బండ్ల ఊరేగింపు
గురుపాద గుట్ట శివాలయం జాతర ఉత్సవాలలో భాగంగా ఎండ్లబండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. శివాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణల బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో దేవాలయ ప్రాంగాణం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లకు వివిధ రంగు రంగుల కాగాతాలతో దేవతామూర్తుల క్యాలెండర్లను ఎడ్లబండ్లపై అతికించి అందంగా అలంకరించి ఉదయం వేద బ్రహ్మణులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం, మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బలరాం సంగమేశ్వర్‌, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement