పమిడిముక్కల : విధులు ఓ చోట,నివాసం మరో చోట అనే తీరులో ఓ వైద్యురాలు నిర్లక్ష్య విధులు నిర్వహిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్న వైనం మండల పరిధిలోని ఓ వైద్య శాలలో జరుగుతుంది.వివరాల్లోకి వెళితే పమిడిముక్కల మండల పరిధిలోని వీరంకిలాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణ చేసే ప్రాంతానికి సమీపంగా ఉండాలి అనే నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ సుదూర ప్రాంతాల నుండి సమయానికి వైద్యులు రాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల ప్రజలను గాలికి వదిలేసి పట్టణాల్లో నివాసం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందకపోవడం వలన పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి వైద్యో నారాయణ హరి అన్న నానుడికి మచ్చ తెచ్చేవిధంగా వైద్యుల వ్యవహారశైలి ఉందని ప్రజలు వాపోతున్నారు కరోనా సమయంలో అటు ప్రైవేట్ హాస్పిటళ్లు మూతపడటంతో స్థానిక వైద్యురాలి వ్యవహార శైలితో ఆర్ఎంపీలే దిక్కైన వైనం ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో ఎన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్య వైఖరితో పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి అని సంబంధిత అధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చొరవ చూపాలని వేడుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement