Friday, November 22, 2024

బాలికల చదువుతోనే దేశ భవితవ్యం – టీపీటీఎఫ్

జ‌గ‌దేవ్ పూర్ – అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా టీ పి టీ ఎఫ్ జగదేవపూర్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల పాఠశాలలో మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో టీ పి టీ ఎఫ్ అధ్యక్షులు నేతి శంకర్, ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ బాలికల చదువు తోనే భారతదేశ భవితవ్యం ముడిపడి వున్నదని అన్నారు. ఎందరో వీరవనితలు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని వారి పోరాటశక్తిని అలవరచు కోవాలని, చదువుల తల్లి సావిత్రి భాయిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంత‌రం విద్య వైద్య రంగాలకు చెందిన సావిత్రి , సాగరిక, ఎఎన్ ఎంలు రజని, లావణ్యల‌ను దుశ్శాలువల‌తో స‌త్క‌రించారు.. .సన్మాన గ్రహీత ఎ ఎన్ ఎం రజనీకుమారి మాట్లాడుతూ సేవ చేయడంలో లభించే తృప్తి ఎందులో దొరకదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ సభ్యులు అంకం వెంకటేశ్వర్లు, జలంధర్ రెడ్డి, సత్తయ్య, సోమాచారి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement