జగదేవ్‌పూర్ : జగదేవ్‌పూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌గౌడ్ సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తనవంతు సహకారంగా ప్రజలకు వేసవికాలంలో మంచినీటిని అందివ్వడం జరుగుతుందని గుర్తుచేశారు. మునిగడప పరిసర ప్రాంతాల ప్రజలు ఈ చలివేంద్రంలో దాహం తీర్చుకోవడం జరుగుతుందని, నీటిని వృధా చేయకుండా ప్రజలు సహకరించాలన్నారు. సహజ వనరులు భవిష్యత్ తరాలకు అందాలంటే ప్రస్తుతం కలుషితమవుతున్న ప్రతి ఒక్కదాన్ని అరికట్టాలన్నారు. అందులో భాగంగానే నీటి వృధాను కూడా అరికట్టాలన్నారు. వేసవిలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ వద్ద మూగ జీవాలకు, పక్షులకు నీటిని అందించినట్లయితే ఎంతో పుణ్యం చేసినవారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాల్‌లక్ష్మిఅయిలయ్య, ఉపసర్పంచ్ లావణ్యమల్లేశం, గుర్రం శ్రీకాంత్, పబ్బ హరిగౌడ్, మల్లేశం, శేఖర్, నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement