Saturday, November 23, 2024

తహశీల్దార్ కి వినతిపత్రం…

రామాయంపేట : కేంద్ర ప్రభుతం నూతనంగా తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయుసి ఆధ్వర్యంలో బీడి వర్కర్స్ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసి జిల్లా ప్రధానకార్యదర్శి అయ్యవారి లక్ష్మన్‌ మాట్లాడుతూ సిగిరెట్‌ పరిశ్రమలకు తొత్తులుగా మారి బీడి పరిశ్రమ నుంచి వస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల కాలం నుంచి బీడి పరిశ్రమపె ఆధారపడి కార్మికులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం నుండి బీడి పరిశ్రమను మినహాయించాలని ఆయన డిమాండ చేశారు. ఈ కార్యక్రమంలో బీడి వర్కం ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి కొండ శ్రీనివాస్‌, తెరాస కార్మిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి తాడెం రవి, గోకుల యాదగౌడ, చాట్ల సిద్దయ్య, జీడి యాదగౌడ, బాలాగౌడ, అజీజ్‌ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement