జగదేవ్‌పూర్ : జగదేవ్‌పూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో గత నాలుగు రోజులుగా గ్రామ దేవతలకు పండుగ నిర్వహించడంతో పాటు గ్రామంలోని బొడ్రాయిని ఏర్పాటు చేయడం జరిగింది. గతకొన్ని సంవత్సరాలుగా బొడ్రాయి పండుగను నిర్వహిస్తూ భీమ్‌రాజ్ దేశ గురువు పండుగలో పాల్గొన్నారు. గ్రామంలో ఒకసారి బొడ్రాయి పండుగ నిర్వహించినట్లయితే 300 సంవత్సరాలు గ్రామానికి ఆయుష్షు వస్తుందని అన్నారు. గ్రామమంతా ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో, పాడిపంటలతో ఉండాలంటే గ్రామంలో బొడ్రాయిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని దేశ గురువు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు , ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement