Tuesday, November 26, 2024

ఇంటిపన్ను వసూల్

రామాయంపేట :రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్నులు, నల్లాబిల్లుల వసూలును మున్సిపల్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆదేశాల మేరకు వేగవంతం చేయడం జరిగిందని మున్సిపల్‌ బిల్‌కలెక్టర్లు గడ్డం అశ్విత, పోచమ్మల శంకర్‌, బల్ల శ్రీనివాస్‌లు తెలిపారు. ప్రభుత్వం మార్చి నెలలో ఇంటి పన్ను చెల్లించే వారికి 90 శాతం మాఫీ కింద మినహాయింపు కింద ఇంటిపన్నులు తీసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది రమేష్‌, పద్మ, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement