Thursday, October 17, 2024

గోస పోతున్న గొంగలి బతుకులు…

ఆధునిక యాగంలో గొంగళ్లకు ఆదరణ కరువు
ఉపాధి లేక అవస్థలు పడుతున్న కుటుంబాలు
రామాయంపేట – తెలంగాణ సంస్కృతి లో అత్యంత ప్రాధాన్యతను అంతరించి కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రతి ఇంట్లో ఆధారపడిన గొంగలి మారుతున్న కాలంతో పాటు కనుమరుగవుతుంది గొంగళి తయారీకి కావలసిన ఉన్ని లభించే నల్ల జాతి గొర్రెలు అంతరించి పో తుండడంతో పాటు అత్య దునిక పరిజ్ఞానంతో తయారు చేసిన దుప్పట్ల రగ్గులు మార్కెట్లోకి రావడంతో గొంగలికి ఆదరణ కరువైంది. దీంతో గొంగళి తయారీ ని నమ్ముకున్న వారి జీవితాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నల్ల జాతి గొర్రెల ఉన్ని తో వేసిన గొంగలి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కుల వృత్తి దారులు ఎంతో నేర్పు నైపుణ్యంతో నల్లటి రంగులో గొంగళి ని తయారు చేస్తారు. చలికాలంలో వెచ్చదనం ఇచ్చే గొంగళిని ఎలా వాడుతున్నా మురికి పట్టేది కాదు ఒక్కో గొంగళి ఏళ్ళతరబడి మంచిగా ఉండేది. ఒకప్పుడు ఏ పల్లె లో చూసిన గొంగల్లే దర్శనమిచ్చేవి గొల్ల కురుమలు ఏ కార్యక్రమం చేసిన తప్పని సరిగా గొంగళ్లను ఉపయోగించే వారు. కానీ నేటి ఆధునిక యుగంలో ఈ కాలంలో పాటు గొంగళ్ల విక్రయాలు తగ్గిపోయాయి ప్రస్తుతం మార్కెట్లో రంగు రంగుల రగ్గులు దుప్పట్లు రావడంతో గొంగలి పై ఆసక్తి తగ్గిపోయింది. దీంతో గొంగళి తయారీని అరేయ్ నమ్ముకున్న వారి బ్రతుకులు అద్వానంగా మారుతున్నాయి.ఈ వృత్తిని నమ్ముకున్న వారు ప్రస్తుతం కొందరు కూలీ పనులకు వెళ్తుండగా మరికొంతమంది కులవృత్తిని వదిలిపెట్టక దుర్భర జీవితం గడుపుతున్నారు.

ఆనాటి కాలం అయిపోయింది – చందర్ల వెంకటి
మూడు రోజులు కష్టపడి ఇంట్లో గొంగళిని వేస్తే ఇంటి వారందరికీ మూడు పూటల భోజనం దక్కేది నెలలో 10 గొంగల్లు చేసి అమ్ముకునే వాళ్ళమ్మ చుట్టుప్రక్కల వారు ఇక్కడికి వచ్చి దొంగలు కొనేవారు వేరు ఇప్పటి దౌర్భాగ్యం వేరు చేయదు చేయూతనందిస్తే మా చేతులకు పని చెబుతాము.

అప్పుడు దారం తీశాం -ఇప్పుడు లేదు ఆ ధారం – చందర్ ల జయమ్మ
నమ్ముకున్న కుల వృత్తిని వదులుకోలేక గొంగలిని తయారు చేసుకుంటూ బ్రతుకుతున్నాం ఒక్క గొంగళి కోసం మూడు దినాలు ఆపకుండా పని చేశాము.మా ఇంటిఆయన మగ్గం పై వేస్తే దారాలతో ఆధారంగా గొంగలిని తయారు చేసాము.అయిన యిప్పుడు గొర్రెల ఉన్ని దారం లేదు. మా జీవితాలకు ఆ దారం లేదు.ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేదన్నారు.

గొంగళితోనే బ్రతుకు – కార్మికుడు చందర్ల రాహుల్
నమ్ముకున్న కులవృత్తిని వదలలేక గొంగళి తయారు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. జీవితం తో పోల్చితే ప్రస్తుతం గలా వరకు వీటి ఆదరణ తగ్గింది. ప్రభుత్వం కుల వృత్తులనుప్రోత్సహించి ప్రత్యమయా చూపాలి దీని పై ఆదరపడితే కుటుంబం గడవని పరిస్థితి.వూరూరా తిరుగుతూ గొంగళ్లను అమ్ముకుంటున్నాం.వారానికి ఒక గొంగళి కూడా పోవడం లేదన్నారు. కరీంనగర్ జగిత్యాల వరంగల్ జిల్లాలో తిరుగుతూ అమ్ముకొని జీవిస్తున్నాము కానీ దిక్కుతోచక ఇదే పని చేస్తున్నాము నేత కార్మికులు

Advertisement

తాజా వార్తలు

Advertisement