మెదక్ – రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య సంఘటనలు కలకలం రేపుతున్నాయి.
మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో చేట్టుకు ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అటు… సిద్దిపేటలో కుటుంబంతో సహా ఆత్మహత్యయత్నం చేశారు బాలక్రిష్ణ. పురుగుల మందుతాగిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు బాలక్రిష్ణ. అయితే… భార్యకు నీళ్లలో ఎలుకల మందు, పిల్లల్లకు పాలల్లో పురుగుల మందు కలిపి ఇచ్చారు బాలక్రిష్ణ. కుటుంబ సభ్యులకు విషమిచ్చిన తర్వాత ఉరివేసుకుని బాలక్రిష్ణ సూసైడ్ చేసుకున్నాడు. కాగా, భార్య, పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటం చూసి స్థానికులు వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు సంఘటనలపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.