కళాశాల వెళ్లి బాగా చదవాల్సిన విద్యార్థులు రౌడీలుగా తయారవుతున్నారు. రోడ్ల మీదకు చేరి గ్యాంగ్వార్లకు పాల్పడుతున్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాల్సిన వారు రోడ్ల వెంబడి తిరుగుతూ గొడవలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఓ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు చిన్న గొడవ జరిగింది. వాగ్వాదం కాస్త పెరిగి చివరకు పెద్ద దుమారానికి దారి తీసింది. దీంతో ఓ విద్యార్థి అర్ధనగ్నంగా తిరుగుతూ హంగామా చేశాడంతో కాలేజీ సెక్యూరీటి సిబ్బంది ఎంట్రీ ఇచ్చారు. కాగా.. అదిగమనించిన కాలేజీ విద్యార్థులు పరార్ అయ్యారు. ఈ ఘటన నర్సాపూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో చోటుచేసుకుంది.