ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్): మెదక్ జిల్లా కావాలనేది కొన్ని దశాబ్దాల కల.. ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ మాట ఇచ్చారు. ఏండ్లు గడిచాయి కానీ జిల్లా కల నెరవేరలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. అది కొన్ని రోజుల్లోనే నేరవేరింది. జిల్లా పోలీసు ఆఫీసు, కలెక్టరేట్ భవన సముదాయం, మెడికల్ కాలేజీ, రైలు అన్నీ మెదక్‌కు వచ్చాయి. ఇవన్నీ కేసీఆర్ సీఎం కావడం వల్ల మాత్రమే సాధ్యమయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలో బుధవారం జరిగిన ప్రగతి శంఖారావం సభ ప్రారంభంలో ఆయన ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పదికి పది మందిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. మరోసారి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని మంత్రి హరీశ్ కోరారు.