Friday, November 22, 2024

Medak – కలెక్టర్ దంపతుల పొలం బాట

ఆంధ్రప్రభ స్మార్ట్ – మెదక్ – మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఔరంగాబాద్‌ గొల్ల నారాయణ అనే రైతు పొలం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ దంపతులు రైతులతో కలిసి వరి నాట్లువేశారు.

ప్రజాక్షేత్రంలో బిజీబిజీగా గడిపే అధికారి. పనులను పక్కనపెట్టి సెలవు రోజైన ఆదివారం పొలంబాట పట్టారు. భార్య, పిల్లలతో కలిసి సాధారణ వ్యవసాయ కూలిల్లా మారి పొలంలో నాట్లు వేశారు

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సుమారుగా 70వేల రైతులకు రూ.447 కోట్ల రైతు రుణమాఫీ నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.

లాభదాయక సాగు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని.. అందుకు తోడ్పాటు అందించేందుకే పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిందని రైతులకు వివరించారు. నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ దంపతులు వరినాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement